Actress Sai Pallavi: ‘తండేల్’ బోటులో సాయిపల్లవి !

‘తండేల్’ బోటులో సాయిపల్లవి !

Actress Sai Pallavi: ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ చిత్రాల తర్వాత నాగచైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందునున్న తాజా సినిమా ‘తండేల్‌’. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మత్సకారులు చేపల వేటకు వెళ్లి… పాకిస్తాన్ జైల్ లో బందీలుగా మారిన యథార్ధ కథ ఆధారంగా, విభిన్నమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ను కర్ణాటకలోని ఉడిపి మల్పే పోర్ట్‌లో కొద్దిరోజుల క్రితం ప్రారంభించారు. ఉడిపిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని గోకర్ణకు షిప్ట్ కావడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సాయిపల్లవి మొదటి సారిగా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయింది. దీనితో ‘తండేల్’ వరల్డ్ నుండి తాజాగా హీరోయిన్ సాయిపల్లవి స్నీక్ పీక్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం సాయిపల్లవి స్నీక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Actress Sai Pallavi Movie Updates

‘తండేల్‌’ సినిమాలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి(Sai Pallavi) కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీని చూడబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. ‘తండేల్’ వరల్డ్ నుండి హీరోయిన్ స్నీక్ పీక్ విడుదల చేశారు. ఈ ఇమేజ్‌లో సాయి పల్లవి బీచ్‌లో నిలబడి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అందమైన పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి ఇందులో నటిస్తున్నట్లుగా ఈ పిక్ చూస్తుంటే అర్థమవుతోంది. యదార్థ సంఘటనల కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య తన పాత్ర కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఈ ప్రేమకథను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతోన్న ఈ సినిమాకు విజువల్ వండర్‌ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్‌గా పని చేయగా ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.

Also Read : Director A L Vijay: అమలాపాల్ మాజీ భర్తపై దాడి

Akkineni Naga ChitanyaSai Pallavi
Comments (0)
Add Comment