Regina : రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను పలు సినిమాలలో నటించింది. కొన్ని మూవీస్ సక్సెస్ కూడా అయ్యాయి. ప్రస్తుతం తను మగిజ్ తిరునేని దర్శకత్వంలో అజిత్ కుమార్ సరసన కీ రోల్ లో నటిస్తోంది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది రెజీనా కసాండ్రా(Regina Cassandra).
Regina Cassandra Movie Updates
ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ హవా కొనసాగాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాను రాను దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున మూవీస్ రావడం, అవి పాన్ ఇండియాను ఆకర్షించడంతో టెక్నీషియన్స్, దర్శక , నిర్మాతలు తమ ధోరణిని మార్చుకోక తప్పలేదని బాంబు పేల్చారు.
సౌతిండియా నుంచి వచ్చిన నటీ, నటులకు బాలీవుడ్ లో అవకాశం ఇచ్చే వారు కాదని, ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు టాలీవుడ్ బ్యూటీ.
రాను రాను హిందీ మూవీస్ హవా పూర్తిగా తగ్గి పోవడంతో గత్యంతరం లేక సౌతిండియాకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీ నటులు, సాంకేతిక నిపుణులను గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల అట్లీ కుమార్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందన్నారు. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ బాక్సులు బద్దలు కొట్టిందన్నారు.
మొత్తంగా ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలు రావడం ఒకింత ఆహ్వానించాల్సిందేనని అన్నారు రెజీనా కసాండ్రా. తాను ఇటీవలే ఓ హిందీ మూవీకి సైన్ చేశానని చెప్పింది. వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొంది.
Also Read : Beauty Varalaxmi Movie : పాన్ ఇండియా మూవీకి వరలక్ష్మి ఓకే