Beauty Rashmika Health : గాయ‌ప‌డిన మంద‌న్నా ఫ్యాన్స్ ఆందోళ‌న

త్వ‌ర‌లోనే కోలుకోవాలంటూ విన్న‌పాలు

Rashmika : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జిమ్ చేస్తుండ‌గా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కు వీల్ చైర్ లోనే వ‌చ్చారు. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. త‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Rashmika Fans Shocking

తీవ్రంగా కాలికి గాయం కావ‌డంతో న‌డిచేందుకు వీలు లేకుండా పోయింది. ఇప్ప‌టికే ఆస్ప‌త్రిలో చేరిన ర‌ష్మిక(Rashmika) మంద‌న్నాకు మెరుగైన వైద్య చికిత్స‌లు అందించారు. ప్ర‌స్తుతం త‌ను అల్లు అర్జున్ తో క‌లిసి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప సీక్వెల్ మూవీ పుష్ప‌-2 మూవీ రికార్డుల మోత మోగించింది. గ‌త ఏడాదిలో విడుద‌లైన ఈ చిత్రం ఏకంగా 46 రోజుల్లోనే రూ. 1830 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింది. ఇది అరుదైన రికార్డు.

ఇదిలా ఉండ‌గా త‌ను పూర్తిగా ఫిట్ నెస్ తో ఉండేందుకు ర‌ష్మిక మంద‌న్నా గ‌త కొంత కాలం నుంచి ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తోంది. 15 రోజుల కింద‌ట జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తుండ‌గా త‌న కాలికి గాయ‌మైంది. కాలికి గాయం కావ‌డంతో క‌ట్టు క‌ట్టారు. ఆ క‌ట్టుతోనే సిటీకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం త‌ను మ‌రాఠా చిత్రంలో న‌టిస్తోంది. మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించే చిత్రంలో ఛ‌త్ర‌ప‌తి భార్య‌గా న‌టిస్తోంది.

Also Read : Gautham Vasudev Shocking : ఎక్కువ కాలం ప‌ని చేయ‌లేక పోవ‌చ్చు

Health ProblemsRashmika MandannaUpdatesViral
Comments (0)
Add Comment