Rakul Preet Singh : డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు పోలీసుల అదుపులో

అయిదుగురు నైజీరియన్లతోపాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన అయిదుగురు ప్రముఖులను అరెస్ట్ చేశారు...

Rakul Preet Singh : గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఎన్ని చర్యలు తీసుకుంటున్న డ్రగ్స్, గంజాయిని పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకువస్తున్నారు కేటుగాళ్లు. పోలీసుల కళ్లు గప్పి యువతకు, వ్యాపారస్తులకు డ్రగ్స్ చేరవేస్తున్నారు. తాజాగా మరోసారి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rakul Preet Singh…

అయిదుగురు నైజీరియన్లతోపాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన అయిదుగురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. ఇందులో సినీరంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న రకుల్.. ఇటీవలే ఇండియన్ 2 సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. కమల్ హాసన్ నటించిన ఈ మూవీ జూలై 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రకుల్, సిద్ధార్థ్ కీలకపాత్రలు పోషించారు.

Also Read : KA Movie Teaser : పోస్ట్ మాన్ పాత్రలో ‘క సినిమాతో వస్తున్న కిరణ్ అబ్బవరం

BreakingDrugs CaseRakul Preet SinghUpdatesViral
Comments (0)
Add Comment