Poonam Kaur : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పై నటి పూనమ్ కీలక ట్వీట్

అనంతరం చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది...

Poonam Kaur : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘పుష్ప-2 ది రూల్. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. తెలుగుతో తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతోంది. ముఖ్యంగా బన్నీ సినిమా ధాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) పుష్ప 2 సినిమాను చూసింది.

అనంతరం చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ పుష్ప 2 పై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్(Poonam Kaur). ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది. బన్నీ అభిమానులు పూనమ్ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ‘నీ టైమింగ్ ఏమి బాగోలేదు మేడమ్. అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 టీమ్ ఇప్పుడు సమస్యలతో సతమవుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ పోస్ట్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Poonam Kaur Comment

కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చుకున్నాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ను కలుస్తానని కూడా తెలిపాడు.

Also Read : Game Changer : గ్లోబల్ స్టార్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి వైరల్ అవుతున్న డోప్ సాంగ్

allu arjunCommentsPoonam KaurPushpa 2Viral
Comments (0)
Add Comment