Keerthy Suresh : తన చిన్ననాటి స్నేహితునితో పెళ్లి పీటలెక్కనున్న నటి కీర్తి సురేష్

తాజాగా ఆమె లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని వార్తలు విన్పిస్తున్నాయి...

Keerthy Suresh : మహానటి ‘కీర్తి సురేష్’ పెళ్లి వార్తలు నెట్టింట్లో వీపరితంగా చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులు వరకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలు వినిపించగా. తాజాగా ఆమె లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని వార్తలు విన్పిస్తున్నాయి. ఇక మరికొందరు పెళ్లి ఎక్కడ జరుగుతుందో కూడా డిసైడ్ చేశారు. ఇంతకీ ఆ వార్తల్లో నిజం ఎంత ఉంది? లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? పెళ్లి ఎక్కడంటే..

Keerthy Suresh Marriage Updates

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బర్త్ డే అక్టోబర్ 16. నటి కీర్తి సురేష్(Keerthy Suresh) బర్త్ డే అక్టోబర్ 17. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ వరుసగా పార్టీల్లో పాల్గొనేవారు. దీంతో వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ పుట్టించేశారు. ఈ రూమర్స్‌కి చెక్ పెడుతూ కీర్తి.. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీర్తి మరొకరిని పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కాగా ఈ వార్తలపై కీర్తి సురేష్ అఫీషియల్‌గా రెస్పాండ్ కానప్పటికీ ఈ వార్తల్లో వాస్తవముందని పక్క సమాచారం.

కీర్తి తన చిన్న నాటి మిత్రుడు ‘ఆంటోనీ తటిల్’ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చాలా కాలం నుండే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు తెలిసింది. అయితే వీరిద్దరూ డిసెంబర్ 11 లేదా 12న గోవాలో పెళ్లాడనున్నారు. మరోవైపు ఆమె త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ చేయనుంది. దళపతి విజయ్, సమంత జంటగా కలిసి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తేరి’ సినిమాని బాలీవుడ్‌లో బేబీ జాన్‌గా రీమేక్ చేయనున్నారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటించనుండగా, సమంత పాత్రని కీర్తి సురేష్ పోషించనుంది.

Also Read : Sushmita Sen : బ్రేకప్ తర్వాత చివరికి ఒంటరిగానే సాగిస్తున్న మాజీ ప్రపంచ సుందరి

Keerthy SureshmarriageTrendingUpdatesViral
Comments (0)
Add Comment