Actress Kasthuri : తన మూడు రోజుల జైలు జీవితంపై వ్యాఖ్యానించిన నటి కస్తూరి

నాకు కొత్త పళ్లెం, కొత్త లోటా ఇచ్చారు. జైలు సిబ్బంది బాగా చూసుకున్నారు. ఇక్కడో విషయం చెప్పాలి...

Actress Kasthuri : కస్తూరి.. తెలుగు సినిమాలు, సీరియల్స్‌ చూసేవారికి సుపరిచితమైన పేరు. ఇటీవల ఓ పొలిటికల్ ఈవెంట్‌లో తెలుగువారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆమెను హైదరాబాద్‌లో తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వృత్తిరీత్యా మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన కస్తూరి(Actress Kasthuri).. తన జైలు జీవితం గురించి ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.

Actress Kasthuri Comments

‘ఆదివారం అరెస్ట్‌ చేశారు. బుధవారం బయటకు వచ్చేశా. నేను జైలు లోపలికి వెళ్లక ముందే అక్కడున్న వారందరికీ నేను వస్తున్నానని తెలిసిపోయింది. ‘స్టాలిన్‌ ఈమెను లోపలికి పంపాడట’ అని వాళ్లు అనుకుంటూ ఉంటే విన్నా. అక్కడ నాకు ఒక స్పెషల్‌ సెల్‌ ఇచ్చారు. తొలిసారి వచ్చిన ఖైదీలందరూ దానిలోనే ఉంటారట. నాకు కొత్త పళ్లెం, కొత్త లోటా ఇచ్చారు. జైలు సిబ్బంది బాగా చూసుకున్నారు. ఇక్కడో విషయం చెప్పాలి. జైలు జీవితం సినిమాలో చూపించినట్లు ఉండదు. నేను అనేక సినిమాల్లో, సీరియల్స్‌లో జైలు సీన్లు చేశాను. కానీ నిజమైన జైలు వేరుగా ఉంటుంది.

మరోవిషయం ఏమిటంటే… తమిళ ‘బిగ్‌బాస్‌’లోకి నేను ఒకసారి స్పెషల్‌ ఎంట్రీగా వెళ్లాను. ఆ సమయంలో ‘బిగ్‌బాస్‌ జైలు’లో ఉండాల్సి వచ్చింది. వాస్తవానికి అక్కడ కన్నా నిజమైన జైలులోనే బాగుంది. నిజమైన జైలులో ప్రమాదకరమైన వారు ఉంటారు. అమాయకులు కూడా ఉంటారు. భర్తలు చేసిన నేరాలకు జైలుకు వచ్చిన భార్యలు కూడా ఉన్నారు. జైలుకు వెళ్తున్నప్పుడు మొదట్లో నాకు అవమానంగా అనిపించింది. కానీ స్నేహితులు… ‘నువ్వు నేరం చేసి జైలుకు వెళ్లలేదు.. ఒక సిద్ధాంతం కోసం వెళ్తున్నావు’ అన్నారు. నిజమే కదా అని అనిపించింది. ఇక్కడొక విషయం చెప్పాలి. నేను జైలుకు వెళ్లకపోతే నా తెలుగు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో తెలిసేది కాదు. ఆ విధంగా చూస్తే నాకు మంచే జరిగింది..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read : Vijay Deverakonda : తన ప్రేమాయణం పై వస్తున్న కథనాలపై స్పందించిన విజయ్

CommentsKasthuriPolice CaseViral
Comments (0)
Add Comment