Kajol Shah Rukh Khan : ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ నటుడు షారుక్ ఖాన్ , నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి కలిసి నటించిన జవాన్ చిత్రంపై స్పందించారు. ఇన్నేళ్లయినా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడంటూ కితాబు ఇచ్చారు నటి కాజోల్.
Kajol Shah Rukh Khan Words about Jawan movie
ప్రత్యేకించి దర్శకుడు అట్లీ కుమార్ బాద్ షా లోని నటనను ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని పేర్కొన్నారు. ఆమె ట్విట్టర్ వేదికగా జవాన్ చిత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఎంతో ఉత్కంఠకు గురయ్యానని తెలిపారు నటి కాజోల్.
ఇద్దరం కలిసి పని చేసిన సినిమాలు కూడా తనకు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. నటన పట్ల షారుక్ ఖాన్ కు ఉన్న కసి ఇప్పటికీ ఇంకా తగ్గ లేదని ఇది తనను విస్తు పోయేలా చేసిందని తెలిపింది కాజోల్(Kajol). ప్రతి పాత్ర గుండెల్ని హత్తుకునేలా ఉందన్నారు. ప్రధానంగా అట్లీ కుమార్ పెట్టిన ఫోకస్ ఏమిటో ఈ సినిమాను చూస్తే తెలుస్లుందన్నారు నటి.
ఇదిలా ఉండగా అట్లీ కుమార్ జవాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రూ. 220 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇప్పటికే విడుదల కాకుండానే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది జవాన్ కు. వరల్డ్ వైడ్ గా తొలి రోజే రూ. 120 కోట్లు వసూలు కావడం సినీ ట్రేడ్ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Also Read : Jawan Movie Record : జవాన్ మూవీ రికార్డ్ బ్రేక్