Bhanupriya : తెలుగు సినీ పరిశ్రమలో ఎల్లప్పటికీ గుర్తుంచుకునే పేరు భానుప్రియ. నాట్యం చేయడంలో తనకు తనే సాటి. ప్రత్యేకించి సృజనాత్మకత, భావుకతకు పేరు పొందిన వంశీ దర్శకత్వంలో భాను ప్రియ(Bhanupriya) నటించింది..ప్రేక్షకులను మైమరిచి పోయేలా చేసింది. ఒక్కో సినిమా ఒక్కో క్లాసిక్. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు దర్శకుడు. తను దర్శకురాలి హీరోయిన్ అన్నారు వంశీ. ఆమె కెరీర్ లో మరిచి పోలేని చిత్రం ఆలాపన. ప్రేమించు పెళ్లాడు.
Bhanupriya…
తన అసలు పేరు మంగభాను. వంశీనే భాను ప్రియగా మార్చేశాడని అంటారు. తన వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. స్వస్థలం రాజమండ్రి జిల్లా రంగంపేట. జనవరి 15, 1967లో పుట్టింది. సినీ నటిగా, నర్తకిగా పేరొందారు. 1980-1993 మధ్య కాలంలో భానుప్రియ అనేక తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించారు. 1990లో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. తన సోదరి శాంతి కూడా నటిగా కొన్ని చిత్రాలలో నటించి ఆ తర్వాత కనుమరుగైంది.
ఇక భాను ప్రియ విషయానికి వస్తే తన సినీ కెరీర్ లో 110 సినిమాలకు పైగా నటించింది. ఇప్పటికీ ఎప్పటికీ నటిగా, నర్తకిగానే ఉండి పోవాలని తన కోరిక అని చెప్పింది. తను ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. అక్కభ భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటారు. తనను వంశీ సితార మూవీతో పరిచయం చేశాడు చలన చిత్ర పరిశ్రమకు . అది బిగ్ హిట్. కె. విశ్వనాథ్ తీసిన స్వర్ణ కమలంలో ఆకట్టుకుంది. చాలా కమర్షియల్ చిత్రాలలో నటించింది. అగ్ర హీరోల సరసన నటించిన భాను ప్రియ వారితో పోటీగా నాట్యం చేసింది..పేరు తెచ్చుకుంది.
Also Read : Ranya Rao Shocking : నటి రాన్యా రావుకు సీబీఐ ఝలక్