Beauty Anshu Ambani :కంటిన్యూ చేసి ఉంటే టాప్ లో ఉండేదాన్ని

మ‌న్మ‌థుడు హీరోయిన్ అన్షు అంబానీ కామెంట్

Anshu Ambani : మ‌న్మ‌థుడు, రాఘ‌వేంద్ర మూవీస్ లో న‌టించి మెప్పించిన న‌టి అన్షు అంబానీ. త‌ను కీల‌క‌మైన పాత్రలు పోషించింది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. మ‌న్మ‌థుడు ఇప్ప‌టికీ టాప్ లో కొన‌సాగుతోంది. తాజాగా మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు అన్షు . త‌ను ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ ..రీతూ వ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో ఓ మూవీ వ‌స్తోంది.

Anshu Ambani Comment

ఇందులో మ‌రో పాత్ర‌ల్లో రావు ర‌మేష్, అన్షు అంబానీ(Anshu Ambani) న‌టిస్తుండ‌డం విశేషం. ఈ మ‌ధ్య‌నే అన్షు అంబానీ పెళ్లి ఫోటోను మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేసింది. ఇది వైర‌ల్ గా మారింది. మ‌న్మ‌థుడులో అద్భుతంగా న‌టించింది అన్షు. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ చేసింది. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

దాదాపు 20 ఏళ్ల త‌ర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది సినిమాల్లోకి. త‌ను 15 ఏళ్ల స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు సినిమాల్లోకి వ‌చ్చాన‌ని, కానీ నా దృష్టి అప్పుడు మూవీస్ పై ఉండేది కాద‌ని తెలిపింది. త‌ను చ‌దువు కునేందుకు లండ‌న్ కు వెళ్లింది. అక్క‌డే సెటిల్ అయ్యింది. పెళ్లి చేసుకుంది.

ఒక‌వేళ అప్ప‌ట్లో మూవీస్ లో కంటిన్యూగా చేసి ఉండి ఉంటే త‌ను టాప్ హీరోయిన్ల‌లో ఉండేదాన‌ని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. త్రినాథ‌రావు తీస్తున్న మూవీ మ‌జాకాపై పూర్తి న‌మ్మ‌కంతో ఉంది. ఈ సినిమాతో త‌న‌కు మంచి పేరు వ‌స్తుంద‌న్నారు అన్షు అంబానీ. ఇందులోని పాత్ర త‌న‌కు మంచి పాత్ర‌లు ఇచ్చేలా చేస్తుంద‌న్నారు .

Also Read : Thandel Sensational Coll :వ‌సూళ్ల వేట‌లో తండేల్ రికార్డ్

Anshu AmbaniCommentsViral
Comments (0)
Add Comment