Alia Bhatt : బాడీ షేమింగ్ పై భగ్గుమన్న బాలీవుడ్ భామ అలియా భట్

నా ముఖం ఒకవైపు పక్షవాతానికి గురైందని మాట్లాడుతున్నారు...

Alia Bhatt : బాడీ షేమింగ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. తరచూ ఎవరో ఒకరి మీద బాడీ షేమింగ్‌ కామెంట్స్‌ వస్తూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్‌ క్యూటీ ఆలియాభట్‌ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. ఆమెకు కాస్మొటిక్‌ సర్జరీ ఫెయిల్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యన ఆమె నవ్వితే మూతి వంకర పోతుందని కొన్ని కామెంట్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా ముఖం తేడాగా కనిపిస్తోందని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ వీడియాలో తనను ట్రోల్‌ చేస్తున్న వారిపై ఆలియా(Alia Bhatt) మండిపడ్డారు. తన లుక్స్‌ గురించి కామెంట్‌ చేస్తున్న వారి కోసం ఆలియా ఓ పోస్ట్‌ పెట్టింది.

Alia Bhatt Slams..

“కాస్మెటిక్‌ కరెక్షన్‌ లేదా సర్జరీ చేయించుకునే ఎవరి గురించి మాట్లాడను, జడ్జ్‌ చేయను. మీ శరీరం, మీ ఇష్టం. కానీ దీనిపై నడుస్తున్న ట్రోలింగ్‌ హాస్యాస్పదంగా ఉంది. నేను చేయించుకున్న బొటాక్స్‌ ఫెయిల్‌ అయిందంటూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం, నేను వంకరగా నవ్వుతాను, మాట్లాడినప్పుడు వింతగా ఉంటాను. నా ముఖం ఒకవైపు పక్షవాతానికి గురైందని మాట్లాడుతున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా ఇలాంటి వీడియోలు ఎలా చేస్తారు. ఇలాంటి కామెంట్స్‌ చేసేటప్పుడు దానికి వెనక ఏముంది. అసలేం జరిగింది అన్నది తెలుసుకోరా? ప్రతి వ్యక్తికి కొన్ని ఇష్టాలు, నిర్ణయాలు, సొంత ఛాయిస్‌లు ఉంటాయి. వాళ్లకు నచ్చినట్లు జీవితాన్ని సాగిస్తుంటారు. వాళ్ల వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి భూతద్దం పెట్టి చూడటం 100 శాతం తప్పే. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మీకు ఎందుకు? అంటూ మండిపడింది. తాజాగా ఆమె నటించిన ‘జిగ్రా’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతంత మాత్రంగా ప్రేక్షకాదరణ పొందింది.

Also Read : Priyanka Mohan : జయం రవి తో దండలు మార్చుకోవడం పై స్పందించిన ప్రియాంక మోహన్

Alia BhattBreakingSlamsUpdatesViral
Comments (0)
Add Comment