Akshara Gowda : టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ అమ్మగా ప్రమోషన్ పొందింది. తనకు పండంటి బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా శుభవార్త షేర్ చేసింది. ఈ సందర్భంగా తన బేబీ కి సంబందించిన క్యూట్ ఫొటోలను కూడా అందులో షేర్ చేసింది. అయితే తనకి పుట్టింది పాపనో, బాబునో మాత్రం చెప్పలేదీ అందాల తార. బేబీ ఫొటోలతో పాటు తాను గర్భంతో ఉన్నప్పటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అక్షర గౌడ(Akshara Gowda) 9 నెలల ఆ అద్భుతమైన రోజులను గుర్తుచేసుకుంది. ‘ తల్లి డ్యూటీ చేస్తూ.. ఎన్నో కోరికలను కోరుతూ 2024వ సంవత్సరాన్ని ఘనంగా ముగిస్తున్నాం. తనకు (భర్త) బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాను. 9 నెలలు నా కడుపులో మోసి.. అచ్చం తనలాగే ఉండే ఒక బేబీ ని గిఫ్ట్ గా ఇచ్చాను’ అని తన ఆనందానికి అక్షర(Akshara Gowda) రూపమిచ్చిందీ అందాల తార. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అక్షర గౌడ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Akshara Gowda As a Mother…
బెంగళూరుకు చెందిన అక్షర గౌడ దర్శకుడు ఆకాశ్ బిక్కీని వివాహం చేసుకుంది. ఇక అక్షర సినిమాల విషయానికి వస్తే.. మొదట తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. తుపాకీ, ఆరంభం, భోగన్, మాయావన్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇక గత కొన్నేళ్లుగా వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. మన్మథుడు 2 , ది వారియర్, దాస్ కా ధమ్కీ, నేనేనా, హరోంహర సినిమాల్లో కనిపించింది అక్షర. ది మస్తీ, మిక్స్ అప్ వంటి బోల్డ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటించిన అక్షర సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటస్ట్ అండ్ గ్లామరస్ ఫొటోలను నెట్టింట తరచూ షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి క్రేజీ కామెంట్స్ వస్తుంటాయి.
Also Read : Janhvi Kapoor : బాలీవుడ్ లో ‘పుష్ప 2’ పై వస్తున్న విమర్శలపై స్పందించిన జాన్వీ