Actor Sudeep : బిగ్ బాస్ లో కొనసాగింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన కన్నడ స్టార్

అంతర్గతంగా జరిగిన కొన్ని లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం...

Actor Sudeep : బిగ్‌బాస్‌ రియాలిటీ షో గురించి ప్రత్యేకించి చెప్పక్కరేందు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో మంచి గుర్తింపు పొందిన షో ఇది. వివిధ భాషల్లో ఆయా చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్‌ హీరోలు ఈ షోకి హోస్ట్‌ చేస్తున్నారు. ‘బిగ్‌బాస్‌ కన్నడ’కు హీరో సుదీప్‌(Actor Sudeep) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 11 సీజన్ల నుంచి ఆయన హోస్ట్‌గా అలరిస్తున్నారు. ఇకపై తాను ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా చేయాలనుకోవడం లేదని దాదాపు రెండు నెలల క్రితం ప్రకటించారు. దీనికి గల కారణాన్ని వివరించారు. ‘‘ఆరోజు పోస్ట్‌ పెట్టినప్పుడు నేను ఎంతో అలసిపోయి ఉన్నాను. ఇకపై ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా చేయకూడదనే ఆలోచన వచ్చింది. నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. దానిని అందరితో చెప్పాలనుకున్నా. అందుకే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టా. ఒకవేళ ఆ సమయంలో నేను పోస్ట్‌ చేయకపోయి ఉంటే నా ఆలోచనా విధానం మళ్లీ మారిపోయేది.

Actor Sudeep Comments

అంతర్గతంగా జరిగిన కొన్ని లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. నా శ్రమకు తగిన గుర్తింపు రాలేదనిపించింది. మిగీలిన భాషల్లో బిగ్‌బాస్‌ కార్యక్రమానికి వచ్చినంత గుర్తింపు కన్నడ షోకు రాలేదు. మిగిలిన షోలతో మా షోను పోల్చి చూస్తే మా కార్యక్రమానికి మరింత గౌరవం, గుర్తింపు రావాలి. అలాంటి గుర్తింపు లేనప్పుడు దీనికోసం కేటాయించే సమయాన్ని సినిమాలపై పెడితే బాగుంటుందని నా ఫీలింగ్‌. అందుకే హోస్టింగ్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా’’ అని సుదీప్‌ చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 11’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సీజన్‌ నుంచి తాను హోస్ట్‌గా చేయనని చెప్పారు. 2022లో విడుదలైన ‘విక్రాంత్‌ రోణ’ తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మ్యాక్స్‌’. విజయ్‌ కార్తికేయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ దీనిని రూపొందించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ గురించి ఆయన మాట్లాడారు.

Also Read : Director Atlee : తనను అవమానించిన యాంకర్ కు ఇచ్చిపడేసిన అట్లీ

Bigg BossCommentsKiccha SudeepViral
Comments (0)
Add Comment