Actor Subbaraju : 47ఏళ్ల వయసుకు వస్తే కానీ.. పెళ్లి గుర్తుకు రాలేదంటూ కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర పర్సనల్ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన అతను అనుకోకుండా డైరెక్టర్ దగ్గరే పర్సనల్ అసిస్టెంట్ గా చేరాడు.
Actor Subbaraju Marriage…
మొదట ‘ఖడ్గం’ సినిమాలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆతర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు సుబ్బరాజు. ఎక్కువగా విలన్ వేషాలు వేసినప్పటికీ కొన్ని సినిమాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడీ స్టార్ యాక్టర్.
Also Read : Ananya Panday : తన రిలేషన్ షిప్ పై బాలీవుడ్ నటి అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు