Harsha Richhariya : ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లక్షలాది మంది భక్తులతో కిటకిట లాడుతోంది. ఎక్కడ చూసినా జనమే జనం కనిపిస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది యోగీ సర్కార్. రెండు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. మరో వైపు స్వామీజీల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
Harsha Richhariya in Mahakumbh mela..
ఇదిలా ఉండగా సోషల్ మీడియా సెలిబ్రిటీలు సైతం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇందులో యాంకర్ , నటిగా , సాధ్విమణిగా గుర్తింపు పొందారు హర్ష రిచారియా(Harsha Richhariya). ప్రయోక్తగానే కాకుండా సామాజిక కార్యకర్తగా పేరొందారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సెన్సేషన్ గా మారి పోయారు. మహా కుంభ మేళాలో తళుక్కున మెరిసారు ఈ ముద్దుగుమ్మ.
నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి శిష్యురాలు కూడా. ఉత్తరాఖండ్ ఈమె స్వస్థలం. బ్యూటిఫుల్ సాధ్వీ అంటూ పేరు వచ్చేసింది. ఈ అమ్మడు ఇప్పుడు కొత్త ఏడాదిలో నేషనల్ క్రష్ గా మారి పోయింది.
సాంప్రదాయ దుస్తులు, రుద్రాక్ష జపమాల, తిలకం ధరించి రిచారియా మొదట్లో యువ సాధ్విగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తాను సాధ్విని కాదని కేవలం మంత్రదీక్ష మాత్రమే తీసుకున్నానని పేర్కొంది హర్ష రిచారియా. 2 ఏళ్ల కిందట తను యాంకరింగ్, నటన, మోడలింగ్ చేపట్టింది. ఆ తర్వాత ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించింది.
Also Read : Hero Anand Deverakonda Movie : మరో కొత్త స్టోరీతో రానున్న ఆనంద్ దేవరకొండ ‘సితార 32’