Actor Raghubabu Shocking :ట్రోలింగ్ జోరు ర‌ఘుబాబు బేజారు 

క‌న్న‌ప్ప మూవీపై కామెంట్స్..సీరియ‌స్ 

Raghubabu : విల‌క్ష‌ణ న‌టుడు ర‌ఘుబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంచు విష్ణు, ప్ర‌భాస్ , మోహ‌న్ బాబు, మోహ‌న్ లాల్ , కాజల్ అగ‌ర్వాల్ , అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం క‌న్న‌ప్ప‌. ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను షురూ చేశారు. ఈ సంద‌ర్బంగా త‌మ మూవీకి సంబంధించి సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ సినిమా హిట్ కావ‌డం ప‌క్కా అని పేర్కొన్నారు.

Actor Raghubabu Shocking Comments

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. ఇది త‌మ‌కు మ‌రింత బ‌లాన్ని ఇచ్చేలా చేసింద‌న్నారు ర‌ఘుబాబు(Raghubabu). త్వ‌ర‌లోనే క‌న్న‌ప్ప‌ను రిలీజ్ చేసేందుకు మూవీ మేక‌ర్స్ సిద్దమ‌య్యారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు.

ప్ర‌ధానంగా ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు ప్యాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్. త‌ను న‌టించ‌డం ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా మారింది. దీనిపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు న‌టుడు మంచు విష్ణు. క‌న్న‌ప్ప‌కు అద్భుత‌మైన చ‌రిత్ర ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌విశంక‌ర్ గురూజీ క‌న్న‌ప్ప టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. ఇదే స‌మ‌యంలో క‌న్నప్ప సినిమా గురించి ఎవ‌రైనా వ్య‌తిరేకంగా ట్రోలింగ్ చేస్తే వారంతా శివుడి ఆగ్ర‌హానికి గుర‌వుతారంటూ హెచ్చ‌రించారు న‌టుడు ర‌ఘుబాబు.

Also Read : Popular Musician Illayaraja :కీర‌వాణి ర‌చ‌న ఇళ‌య‌రాజా స్వ‌ర క‌ల్ప‌న
CommentsRaghubabuShockingViral
Comments (0)
Add Comment