Prabhas : పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ తర్వాత లవర్ బాయ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు మారుతి. తను తీస్తున్న రాజా సాబ్(The Raja Saab) మూవీకి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతే వెంటనే రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. తన బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ కు ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు. అదీ తనకున్న స్టామినా.
Prabhas Movies…
తను మంచి భోజన ప్రియుడే కాదు..షూటింగ్ సమయంలో ఇంటి నుంచే తెప్పిస్తాడు. ఈ మధ్యనే ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పింది ఫౌజీ మూవీలో నటిస్తున్న హీరోయిన్. తన ఆతిథ్యం జీవితంలో మరిచి పోలేనంటూ ఫోటోలను పంచుకుంది.
ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించే పనిలో పడ్డాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇందులో స్పెషల్ గా డార్లింగ్ ప్రభాస్ ను చూపించ బోతున్నాడట. దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న సైనికుడి పాత్రకు సెలెక్ట్ చేశాడని టాక్. ఏది ఏమైనా ప్రభాస్ కు ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనమై పోయే గుణం ఉంది. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్ట పడని ఈ హీరో అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఈ సందర్బంగా ప్రభాస్ హీరో మాత్రమే కాదని, మంచి స్నేహశీలి అన్నాడు. అంతే కాదు తను డైరెక్టర్స్ హీరో అన్నాడు.
Also Read : Beauty Tamannaah : నా శరీరం అంటే నాకెంతో ఇష్టం