Actor Naresh Struggles : న‌రేష్ ప్ర‌యాణం 52 ఏళ్ల ప్ర‌స్థానం

అంకితభావం..క్ర‌మ‌శిక్ష‌ణే కీల‌కం

Actor Naresh : విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా పేరొందారు న‌రేష్. త‌ను సినిమా రంగంలోకి వ‌చ్చి ఏకంగా 52 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్బంగా త‌న అనుభవాల‌ను పంచుకున్నారు న‌రేష్(Actor Naresh). జీవితంలో ఏనాడూ తాను ఇన్నేళ్లు కంటిన్యూగా న‌టిస్తాన‌ని అనుకోలేద‌న్నాడు. ఏది ఎప్పుడు ఎలా జ‌ర‌గాలో అలా జ‌రిగిపోతూనే ఉంటుంద‌న్నాడు.

Actor Naresh Journey Updates

ఈ ప్ర‌యాణంలో ఎన్నో మైలురాళ్లు, మ‌జిలీలు, ఎత్తు ప‌ల్లాలు వ‌స్తుంటాయ‌ని వాటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం అల‌వాటు చేసుకుంటే లైఫ్ మ‌రింత ఆనందంగా ఉంటుంద‌న్నాడు. త‌న కెరీర్ లో మ‌రిచి పోలేని సినిమాలు ఉన్నాయ‌ని చెప్పాడు న‌రేష్.

ఎంతో మంది దిగ్గ‌జ ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌ని చేశాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం ఏక కాలంలో 9 సినిమాలు చేస్తున్నాడ‌న‌ని పేర్కొన్నాడు. ఇన్ని సినిమాలు తానే చేశాన‌న్న ఆశ్చ‌ర్యం క‌లుగుతుంద‌ని పేర్కొన్నాడు. చివ‌రి శ్వాస వ‌ర‌కు తాను షూటింగ్ లోనే ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు , ఇదే త‌న చివ‌రి కోరిక అని అన్నాడు.

రాజ‌కీయ నాయ‌కుడిగా, న‌టుడిగా రెండు భిన్న‌మైన రంగాల‌లో ప‌ని చేయ‌డం కూడా ఒక‌ర‌కంగా త‌న‌కు స‌మాజం అంటే ఏమిటో అర్థం చేసుకునేందుకు దోహ‌ద ప‌డింద‌న్నాడు న‌టుడు న‌రేష్. ఏది ఏమైనా జీవితంలో గొప్ప అదృష్టం త‌న‌ను ప్రేక్ష‌కులు ఎల్ల‌కాలం న‌వ్వులరేడు న‌రేష్ అంటూ గుర్తు పెట్టుకోవ‌డం మ‌రింత సంతోషం క‌లిగిస్తోంద‌న్నాడు.

Also Read : Hero Priyadarshi Movie : అంద‌మైన ప్రేమ‌క‌థ ‘ప్రేమంటే’

Actor NareshCommentsUpdatesViral
Comments (0)
Add Comment