MM Keeravani : సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ వివాహం త్వరలోనే జరగనుంది. ఆదివారం గోల్కోండ రిసార్ట్స్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మహేశ్‌బాబు, రాజమౌళి, సితార, నరేశ్ తదితరులు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
MM Keeravani – Murali Mohan
శ్రీసింహా దర్శకత్వ విభాగంలో పని చేసి నటుడిగా మారారు. బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించి మత్తు వదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్‌సాలే, ఉస్తాద్, మత్తు వదలరా 2 చిత్రాల్లో హీరోగా కనిపించారు. ఇక మురళీ మోహన్ కొడుకు రామ్మోహన్‌కు ఏకైక కుమార్తె రాగ. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మురళీ మోహన్ కుటుంబ వ్యాపారా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read : Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్ పై అగ్రనేతల అభిప్రాయం