Actor Mohan Babu : టాక్సిక్: యష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. దీనికి జీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 1950 నుంచి 1970 మధ్య కాలంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర కథ ప్రస్తుతం బెంగళూరు శివార్లలో కొన్ని ప్రత్యేక సెట్లు వేస్తూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో లండన్‌లో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
Actor Mohan Babu….
సన్ ఆఫ్ సర్దార్ 2: సన్ ఆఫ్ సర్దార్ 2కి సీక్వెల్ గా సన్ ఆఫ్ సర్దార్ రానుంది. ఇందులో అజయ్ దేవగన్, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. మొదటి భాగంతో సంబంధం లేకుండా సీక్వెల్ కథ కొనసాగుతుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. సన్నాఫ్ సర్దార్ 2 యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది.
SSMB29: మహేష్ ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఓపస్. ఈ చిత్రంలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాగే సాహస యాత్ర నేపథ్యంలో ఈ సినిమా ప్రారంభమవుతుంది.
నయనతార: వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న నయనతార తాజాగా మరో సినిమాకు పచ్చజెండా ఊపింది. ఇటీవల విజయ్ సేతుపతితో మహారాజా చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు నితిరన్ స్వామినాథన్ దర్శకత్వంలో నటించేందుకు నయన్ గ్రీన్ లైట్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సామాజిక స్పృహతో కూడిన కథాంశంతో సినిమా ప్రారంభమవుతుంది.
మోహనుబాబు: యువత డ్రగ్స్‌కు అలవాటు పడకుండా అవేర్‌నెస్ వీడియోలు రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ తారలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంచు మోహన్ బాబు(Mohan Babu) స్పందిస్తూ.. తాను గతంలో కొన్ని వీడియోలు తీశానని, అయితే సీఎం ఆదేశాల మేరకు సమాజానికి విశ్వాసం కలిగించేలా మరిన్ని సందేశాత్మక వీడియోలను రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Fahadh Faasil Movie : అమెజాన్ రిజెక్ట్ చేసిన ఫహద్ ఫాసిల్ సినిమా ఓటీటీలో