Mohan Babu : పోలీసుల అదుపులో నటుడు మోహన్ బాబు

ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

Mohan Babu : మంచు మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ బాబుపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తునట్లు సమాచారం. ఆయనను విచారణకు సహకరించాలని పోలీసులు కోరగా ఆరోగ్యం కోలుకున్నాక సహకరిస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన గన్‌ను సరెండర్‌ చేయాలని పోలీసులు ఆదేశించారు. దానికి ఆయన సాయంత్రం సరెండర్ చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే.. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసిందనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మోహన్ బాబు(Mohan Babu) ట్విట్టర్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. శుక్రవారం సాయంత్రం నుండి అజ్ఞాతంలో మోహన్ బాబు అంటూ కొందరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.

Mohan Babu Case..

ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు. నేను మా ఇంట్లోనే వైద్య సంరక్షనలో ఉన్నాను. వాస్తవాలను తెలుసుకుని ప్రసారం చేయాలని ఈ సందర్భంగా మీడియాను కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో ఆయనపై వస్తున్న అజ్ఞాతంలో అనే వార్తలకు బ్రేక్ వేసినట్లయింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశముంది. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉండటంతో డాక్టర్ పర్యవేక్షణలో ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిపారు.

Also Read : Trisha Krishnan : 20 ఏళ్ల తర్వాత హీరో సూర్య తో సినిమా చేస్తున్న త్రిష

Manchu Mohan BabuPolice CaseUpdatesViral
Comments (0)
Add Comment