Actor Leelavathi : ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడిలో జన్మించిన లీలావతి… ‘చంచల కుమారి’తో సినిమాల్లో అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 600 సినిమాల్లో నటించిన లీలావతికి…. ‘భక్త కుంబర’, ‘రణధీర కంటిరావా’, ‘సంత తుకారామ్’, ‘భక్త ప్రహ్లాద’, ‘మాంగల్య యోగ’ వంటి సినిమాల్లో ఆమె నటనకు గొప్ప ప్రజాదరణ లభించింది.
Actor Leelavathi No More
తెలుగులో ఆమె వాల్మీకి, మర్మయోగి, ఇది కథ కాదు, కార్తీకదీపం, మరోమలుపు తదితర చిత్రాల్లో నటించారు. ఆమె ప్రముఖ కన్నడ నటుడు వినోద్ రాజ్ తో పలు చిత్రాల్లో కలిసి నటించారు. చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఆమెకు కర్ణాటక ప్రభుత్వం డా.రాజ్‌కుమార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. లీలావతి(Leelavathi) మరణం పట్ల ప్రముఖ నటి సుమలతతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అభిమానుల సందర్శనార్ధం లీలావతి పార్దివ దేహాన్ని… ఆమె ఫాం హౌస్ లో ఉంచిన కుటుంబ సభ్యులు… శనివారం అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
Also Read : Hero Yash: ‘కేజీఎఫ్’ హీరో యశ్… కొత్త సినిమా ‘టాక్సిక్’