Jayam Ravi : తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నటుడు జయం రవి

తమిళ్ స్టార్ హీరో జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నారు...

Jayam Ravi : సినిమా ఇండస్ట్రీలో విడాకులు కొనసాగుతున్నాయి. చాలా మంది కపుల్స్ విడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సమంత , నాగ చైతన్య విడిపోవడం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే దాదాపు 18 ఏళ్లు కలిసున్నా ధనుష్, ఐశ్వర్య కూడా విడిపోయారు. ఇక జీవి ప్రకాష్ కూడా తన భార్యతో విడిపోయాడు. తాజాగా మరో స్టార్ హీరో కూడా భార్య నుంచి విడిపోతున్నట్టు ప్రకటించాడు.

తమిళ్ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నారు. తమ దాంపత్య బంధానికి డైవోర్స్ తీసుకుంటున్నట్టు జయం రవి ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయం రవి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు ఆరోపణలు చేయొద్దని జయం రవి కోరారు. ఇక రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ స్టార్ హీరో. జయం (2003) తో రవి నటుడిగా తమిళ్ చలన చిత్రరంగంలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది.

Jayam Ravi…

తెలుగులో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలను జయం రవి తమిళ్ లో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆతర్వాత తమిళ్ లో చాలా సినిమాల్లో నటించాడు రవి. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జయం రవి, ఆర్తి 2009 జూన్ లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Also Read : Mowgli Movie : తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న యాంకర్ సుమ తనయుడు

BreakingJayam RaviUpdatesViral
Comments (0)
Add Comment