Jagapathi Babu : రేవతి కుటుంబ పరామర్శ పై స్పందించిన నటుడు జగపతి బాబు

ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు...

Jagapathi Babu : సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని తాను పరామర్శించానని, కానీ ప్రచారం చేసుకోలేదని నటుడు జగపతి బాబు అన్నారు. రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీరి వ్యాఖ్యలపై జగపతి బాబు స్పందించారు.

Jagapathi Babu Tweet

ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. ‘సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక ఊరి నుంచి తిరిగి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. శ్రీతేజ తండ్రి, సోదరిని పలకరించా. బాబు కోలుకుంటాడని ధైర్యం చెప్పా. కానీ ప్రచారం చేసుకోలేదు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నా’ అని జగపతి బాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.

Also Read : Director Sukumar : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పై ప్రశంసలు కురిపించిన సుకుమార్

Jagapathi BabuPushpa 2TweetUpdatesViral
Comments (0)
Add Comment