Actor Hema: బెంగళూరు రేవ్‌పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు – సినీనటి హేమ

బెంగళూరు రేవ్‌పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు - సినీనటి హేమ

Actor Hema: బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ(Actor Hema) స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆమె ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను. నాపై వస్తోన్న వార్తలను నమ్మకండి. అవి ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’ అని విజ్ఞప్తి చేశారు.

Actor Hema Comment

బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్‌ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌ హౌస్ పరిసరాల్లో జాగ్వార్‌, బెంజ్‌ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను జప్తు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Manchu Manoj: మంచు మనోజ్ ‘మిరాయ్‌’ గ్లింప్స్‌ విడుదల !

Actor HemaBangalore Rave Party
Comments (0)
Add Comment