Popular Actor Govinda :విడాకులు అబ‌ద్దం గోవింద ఆగ్ర‌హం

సునీత‌తో 37 ఏళ్ల బంధం మాది
Popular Actor Govinda :విడాకులు అబ‌ద్దం గోవింద ఆగ్ర‌హం

Govinda : బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు గోవింద ఉన్న‌ట్టుండి వార్త‌ల్లోకి వ‌చ్చారు. త‌న భార్య సునీతా అహూజాకు విడాకులు ఇస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. దీంతో డ్యామేజ్ అవుతుంద‌ని తెలిసిన గోవింద(Govinda) సీరియ‌స్ అయ్యాడు. తీవ్రంగా స్పందించాడు. తాము ఇద్ద‌రం క‌లిసి ఉన్నామ‌ని, త‌మ‌కు విడి పోవాల‌న్న ఆలోచ‌న ఏ కోశాన లేద‌న్నారు గోవింద‌.

Govinda Key Comments…

ఇదంతా మీరు కావాల‌ని సృష్టించిన క‌ట్టు క‌థ , రూమ‌ర్స్ అంటూ కొట్టి పారేశాడు . ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అంటూ ప్ర‌శ్నించాడు. గోవింద‌, సునీతా అహూజా 1987లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్ద‌రికీ ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఒక‌రు య‌శ్వ‌ర్ద‌న్ అహ‌జా, టీనా అహూజా. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు గోవింద‌. త‌ను ఇటీవ‌ల జిమ్ చేస్తుండ‌గా గ‌న్ పేలింది. కాలులోకి దూసుకు పోయింది. అదృష్ట‌వ‌శాత్తు బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు. మ‌రో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ క‌త్తిపోట్ల‌కు గుర‌య్యాడు. త‌ను బ‌య‌ట ప‌డ్డాడు.

అయితే ఇటీవ‌లి కాలంలో చాలా ఈవెంట్ల‌లో ఈ ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌క పోవ‌డం మ‌రింత అనుమానాల‌కు తావిస్తోంది. సునీత సోద‌రి గోవింద మామ ఆనంద్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. 1986లో త‌న్ బ‌ద‌న్ సినిమాతో బ్రేక్ ఇచ్చాడు. సునీత‌కు ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. కానీ త‌ను తిర‌స్క‌రించింది.

Also Read : Mazaka Super Sequel :మ‌జాకా సూప‌ర్ సీక్వెల్ ప‌క్కా

CommentsDivorceGovindaViral
Comments (0)
Add Comment