Sana Shaikh Shocking : కాస్టింగ్ కౌచ్ పై స‌నా షేక్ కామెంట్స్

తాను కూడా ఎదుర్కొన్నాన‌ని ఆవేద‌న

Sana Shaikh : సినీ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది స‌ర్వ సాధార‌ణంగా మారి పోయింది. అవ‌కాశాలు రావాలంటే స‌మ‌ర్పించు కోవాల్సిందేన‌న్న ప్ర‌చారం జోరందుకుంది. ఆ మ‌ధ్య‌న కోలివుడ్ లో ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద ఏకంగా ప్ర‌ముఖ త‌మిళ సినీ గేయ ర‌చ‌యిత వైర ముత్తుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేశాడ‌ని వాపోయింది. దీనిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తమైంది. చివ‌ర‌కు త‌న‌కు వ‌చ్చిన అవార్డుల‌ను వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Sana Shaikh Shocking Comments

ఇక చాలా మంది హీరోయిన్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున క్యాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా నోరు విప్పుతున్నారు. ఆ మ‌ధ్య‌న ప్ర‌ముఖ తెలుగు న‌టి ఆమ‌ని సైతం షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్ కు చెందిన న‌టి ఫాతిమా స‌నా షేక్(Sana Shaikh) నోరు విప్పారు. బాంబు పేల్చారు. సినీ రంగంలో త‌ను ప్ర‌వేశించిన సంద‌ర్బంగా చాలా సార్లు వేధింపుల‌కు గురైన‌ట్లు తెలిపింది.

ఈ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా త‌న సినీ అనుభ‌వాల‌ను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. తాను ఓ సినిమాలో న‌టించేందుకు అడిష‌న్స్ కోసం వెళ్లాన‌ని, అక్క‌డ త‌న‌ను ప‌రీక్షించిన వాళ్లు ఏం చేయ‌డానికైనా సిద్ద‌మేనా అంటూ ఓ డైరెక్ట‌ర్ అడిగాడంటూ బాంబు పేల్చింది. త‌ను కూడా దీని గురించి ఏమీ తెలియ‌న‌ట్లే ప్ర‌వ‌ర్తించానంటూ చెప్పుకొచ్చింది.

అమీర్ ఖాన్ తో దంగ‌ల్ మూవీలో న‌టించిన స‌నా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : TG High Court – Shocking :16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌ను అనుమ‌తించొద్దు

casting coutchCommentsViral
Comments (0)
Add Comment