Adivi Sesh : తన గొప్ప మనసును చాటుకున్న నటుడు అడివి శేష్

కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు.

Adivi Sesh : హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇంతకు ముందు ‘మేజర్’ చిత్రానికి కథగా తీసుకున్న మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రుల విషయంలో ఆయన ఎలాంటి కేర్ తీసుకున్నారో, తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలో అడివి శేష్ తీసుకున్న చొరవ.. ఆయనని వార్తలలో హైలెట్ చేస్తోంది.

Adivi Sesh…

విషయంలోకి వస్తే.. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా తన చిన్నారి అభిమాని గురించి తెలుసుకున్న శేష్.. వెంటనే ఆమె కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలిసి సర్ప్రైజ్ చేశారు. పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు.

చిన్నిపాప, ఆమె కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటున్న శేష్(Adivi Sesh), అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు. శేష్‌కి డై -హార్డ్ ఫ్యాన్ అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరోని కలవాలని చాలా కాలంగా కలలుకంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న శేష్, ఆమె కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే ఆ పాపని కలిసి, ఒక రోజంతా ఆమెతోనే సరదాగా గడిపి.. చిన్నారిలో ఆనందం నింపారు. దీంతో స్క్రీన్ మీదే కాదు, అఫ్ స్క్రీన్‌లోనూ అడివి శేష్ లార్జర్ దెన్ లైఫ్ హీరో అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Charu Asopa: విడాకులు తీసుకున్న భర్తతో బాలీవుడ్ బ్యూటీ విహారయాత్ర !

adivi seshCommentsUpdatesViral
Comments (0)
Add Comment