Singham Again : రామాయణంలోని పాత్రలతో సరికొత్త యాక్షన్ సినిమా ‘సింగం అగైన్’

ఇదిలాఉండ‌గా సినిమాల ట్రైల‌ర్ విడుద‌ల అనంత‌రం హీరోల పాత్ర‌ల గురించి తెగ చ‌ర్చ న‌డుస్తుంది...

Singham Again : అజయ్‌ దేవ్‌గణ్ హీరోగా రోహిత్‌ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సింగం సిరీస్‌లో రూపొందిన నూత‌న‌ చిత్రం ‘సింగమ్‌ అగైన్‌(Singham Again)’. అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, టైగర్‌ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్లో రోహిత్‌ మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఆక్టటుకునేలా సాగింది. ఈ ఏడాది నవంబర్‌ ఈ సినిమా ఇది విడుదల కానుంది.

Singham Again Movie Updates

అయితే.. దర్శకుడు రోహిత్ శెట్టి రామాయణంలోని ప్రధాన పాత్రలను గుర్తుకు తెచ్చేలా ఇతిహాసానికి నేటి త‌ర‌హా యాక్షన్‌ను ముడిపెట్టి ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అలాగే ఇంచుమించు ఐదు నిమిషాల వ్యవధితో ఉన్న ఈ ట్రైలర్ చూశాక.. దర్శకుడు రోహిత్ శెట్టిపై సౌత్ సినిమా ఇంపాక్ట్ ఏమేరకు ఉందనేది అర్దమవుతోంది. తొలి నుంచి రొహిత్ శెట్టి తీసే ప్ర‌తి సినిమాలో ఎక్కువగా సౌత్ సినిమాల స్పూర్తి.. మరీ ముఖ్యంగా యాక్షన్ సీస‌న్నివేశాల్లో హీరో పాత్ర‌ల్లో ఔటాఫ్ ద బాక్స్ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.

తాజాగా రిలీజైన సింగమ్‌ అగైన్‌(Singham Again) ట్రైలర్‌లోనూ ఆ విష‌యం తెలుస్తోంది. పైగా అర డజను మందికి పైగా పాపులర్ బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. వారందరినీ సినిమా రిలీజ్ వరకు దాచకుండా.. ట్రైలర్‌లోనే రివీల్ చేసేశారు.. హాలీవుడ్ ఎక్ప్‌పెండ‌బుల్స్ సినిమా మాదిరిగా ఈ సినిమాలోనూ అజయ్ దేవగణ్ , రణవీర్ సింగ్ అక్షయ్ కుమార్ ,టైగర్ ష్రాఫ్ , కరీనా కపూర్ ,దీపికా పదుకునే అర్జున్ కపూర్ ఇలా ట్రైలర్ లో చాలా మందిని దింపాడు.. కాప్ యూనివర్స్ లో భాగంగా రోహిత్ సింబా, సూర్యవంశీ, లేడీ సింగం లాంటి పాత్రలను ఈ సినిమాలో వాడుకున్నాడు. దీపావాళీకి విడుదల కానున్న ఈ సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి..!

ఇదిలాఉండ‌గా సినిమాల ట్రైల‌ర్ విడుద‌ల అనంత‌రం హీరోల పాత్ర‌ల గురించి తెగ చ‌ర్చ న‌డుస్తుంది. రాముడిగా అజ‌య్ దేవ‌గ‌ణ్, సీత‌గా క‌రీనా క‌పూర్, ల‌క్ష్మ‌ణుడిగా టైగ‌ర్ ష్రాప్, హ‌నుమంతుడిగా ర‌ణ‌వీర్ సింగ్, రావ‌ణుడిగా అర్జున్ క‌పూర్, జ‌ఠాయివుగా అక్ష‌య్‌ కుమార్‌, అహాల్య‌గా దీపికా ప‌దుకుణే క‌నిపించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : Amaran Movie : సాయి పల్లవి, శివకార్తికేయన్ ‘అమరన్’ సినిమా ఫస్ట్ సింగిల్

CinemaSingham AgainTrendingUpdatesViral
Comments (0)
Add Comment