Saif : ముంబై – దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన. ప్రస్తుతం తీవ్రంగా గాయపడి ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు.
Saif Attack Case..
విచారణ ప్రారంభించిన పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. ఇప్పటి వరకు సైఫ్(Saif) కు సంబంధించిన కేసులో పురోగతి సాధించామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఒకరిని ఛత్తీస్ గఢ్ లో రైల్వే పోలీసులు పట్టుకోగా , ముంబైలో మారు పేరుతో వెయిటర్ గా పని చేస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ను అరెస్ట్ చేశారు.
తన నుంచి కీలక అంశాలు రాబట్టామని తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. అయితే దాడి ఘటన వెనుక ముంబై అండర్ వరల్డ్ మాఫియా ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు ముంబై సౌత్ జోన్ 9 డీసీపీ దీక్షిత్ బెగెడ్. ఇప్పటికే 10 బృందాలు విస్తృతంగా గాలించాయని చెప్పారు.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. మరో వైపు తాము చూస్తుండగానే తన భర్తపై హత్యాయత్నం జరిగిందంటూ వాపోయింది సైఫ్ అలీ ఖాన్ భార్య, ప్రముఖ నటి కరీనా కపూర్.
Also Read : Hero Vishwak-Laila Teaser : ఆసక్తి రేపుతున్న లైలా టీజర్