Abhishek Bachchan : తన భార్య ఐశ్వర్య రాయ్ కి అభినందనలు తెలిపిన అభిషేక్

Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యారాయ్ లకు సంబంధించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ ఇద్దరూ విడిపోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), అమితాబ్ బచ్చన్ ఖండిస్తున్నారు. అయితే ఐశ్వర్య, అభిషేక్ ఎక్కడా కలిసి కనిపించలేదు. బాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్ కు ఐశ్వర్య ఒంటరిగా కూతురితో వెళ్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ సపరేట్ గా వెళ్తున్నారు. దాంతో అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా తల్లులుగా ఐశ్వర్య, జయ బచ్చన్‌ల బాధ్యతల గురించి అభిషేక్ మాట్లాడాడు.

Abhishek Bachchan Comment

‘‘నేను పుట్టిన తర్వాత మా అమ్మ నటనకు స్వస్తి చెప్పింది. పిల్లలతో గడపాలనేది ఆమె ఉద్దేశం. మా నాన్న దగ్గర లేడన్న ఫీలింగ్ మా అమ్మ మాకు రానివ్వలేదు. నాన్న షూటింగ్స్ పూర్తి చేసుకొని ఎప్పుడో రాత్రిపూట వస్తుంటాడని అభిషేక్ చెప్పాడు. ‘నేను సినిమాలు చేయడం నా అదృష్టం. ఐశ్వర్య ఎప్పుడూ ఆరాధ్య తోనే ఉంటుంది. అందుకు ఆమెకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా కూతురితో లేకపోయినా వాళ్ళు నన్ను మూడవ వ్యక్తిగా చూడరు. నన్ను వాళ్లలో ఒకరిగా చూస్తారు’ అన్నాడు అభిషేక్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

అభిషేక్బచ్చన్ రీసెంట్ గా ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ నటనకు అందరి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో అభిషేక్ సింగిల్ పేరెంట్ పాత్రలో కనిపిస్తాడు. తాజాగా అభిషేక్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోకు అతిథిగా హాజరయ్యాడు. ఈసారి తన కూతురు గురించి మాట్లాడాడు. ‘ఆరాధ్య ఎప్పుడూ నా కూతురే’ అని అన్నాడు.

Also Read : Ruhani Sharma : సీక్రెట్ గా పెళ్లి పీటలెక్కిన ఆ క్రేజీ ముద్దుగుమ్మ

Abhishek BachchanAishwarya RaiCommentTrendingUpdatesViral
Comments (0)
Add Comment