Abhishek Bachchan: సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా సరే ఒక్క ఫ్లాట్ లేదా బంగ్లా కొంటే చాలు… దాని రేటు ఎంత… ఎక్కడ కొన్నారు… ఎవరెవరు ఉంటారు… అనే విషయాలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. దీనితో అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇక తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అపార్ట్‌మెంట్ లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా… మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ. 3.5 కోట్లు విలువ చేసేవి. మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. గత నెల 28నే కొనుగోలు పూర్తవగా, 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది. అయితే ఒక్కసారే ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం అభిషేక్ బచ్చన్ కు ఏంటి అనేది ఇప్పుడు బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.
Abhishek Bachchan Purchased
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు హిట్స్ కొట్టాడు. మంచి నటుడు అనిపించుకున్నాడు. కానీ మరీ సూపర్ స్టార్ రేంజుకి వెళ్లలేకపోయాడు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వ్యాపారాల్లో ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తూ వస్తున్నాడు. కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇతడికి ఓ జట్టు ఉంది.
Also Read : Megastar Chiranjeevi: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రికు మెగాస్టార్ చిరంజీవి సన్మానం !