Abhishek Bachchan : విడాకులపై కీలక వ్యాఖ్యలు చేసిన అభిషేక్, ఐశ్వర్య

కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జీవితం సాగదు...

Abhishek Bachchan : అందాల తార ఐశ్వర్యారాయ్, హీరో అభిషేక్ బచ్చన్ విడిపోయారని, విడాకులు తీసుకున్నారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్యన ఐశ్వర్య, అభిషేక్ ఎవరికి వారే యుమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హజరయ్యారీ లవ్లీ కపుల్. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరైంది. మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్, జయ బచ్చన్ తో కలిసి అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. ఇలా వీరిద్దరూ విడివిడిగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఐశ్వర్య- అభిషేక్ ల విడాకుల రూమర్లు మళ్లీ మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) చేసిన ఓ పని ఇప్పుడు వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. రీసెంట్ గా ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా ఒక పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ విడాకుల గురించి. దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. “ విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదు.

Abhishek Bachchan…

కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జీవితం సాగదు. దశాబ్దాలుగా కలిసి ఉన్న తర్వాత కూడా విడిపోవాల్సి వస్తుంది. విడిపోయిన తర్వాత, ముఖ్యమైన విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడే వారు ఎలా ఉంటారు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం” అని ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. ఇక దీనికే అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. దీంతో తను కొట్టిన లైక్ .. ఇప్పుడు ఐశ్యర్య- అభిషేక్ బంధం మధ్య ఏదో జరుగుతోందనే టాక్ మరింతగా ఎక్కువయ్యేలా చేసింది. విడాకులు అంత ఈజీ కాదని.. ఇన్‌డైరెక్ట్‌గా ఐశ్వర్యతో అభిషేక్‌ చెబుతున్నట్టుగా కనిపిస్తోందనే కామెంట్స్‌ నెటిజన్స్ నుంచి వస్తోంది. అంతేకాదు అభిషేక్‌తో ఐశ్వర్యకు ఏదో సమస్య ఉండొచ్చనే టాక్ బీ టౌన్‌లో ఎక్కువవుతోంది.

Also Read : The GOAT Movie : విజయ్ నటించిన ‘ది గోట్’ సినిమా నుంచి కీలక అప్డేట్

Abhishek BachchanAishwarya RaiBreakingCommentsViral
Comments (0)
Add Comment