AAY Movie Team : వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ‘ఆయ్’ టీమ్

చిత్రబృందం మంచి మనసును అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు....

AAY : వరద బాధితులను ఆదుకునేందుకు ‘ఆయ్‌’ చిత్రబృందం ముందుకు వచ్చింది. వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు నేటి నుంచి వీకెండ్‌ వరకూ ఆ చిత్రానికి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AAY Movie Team Helps

చిత్రబృందం మంచి మనసును అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. నార్నే నితిన్‌, నయన్‌ సారిక, రాజ్‌కుమార్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్‌’. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించారు. బన్నీవాస్‌ నిర్మాత. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్థమైన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.16.40 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని సోమవారం చిత్రబృందం ప్రకటించింది.

Also Read : Pushpa 2 Movie : భారీ ధరకు ‘పుష్ప 2′ ఓటీటీ’ రైట్స్ సొంతం చేసుకున్న ఆ సంస్థ

AayCinemaTrendingUpdatesViral
Comments (0)
Add Comment