Aaron Taylor Johnson: హాలీవుడ్ లో సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘జేమ్స్ బాండ్’ సిరీస్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రపంచ వ్యాప్తంగా దానికి ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు రాగా వాటిలో హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్ బాండ్‌గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. 2021లో వచ్చిన ‘జేమ్స్ బాండ్: నో టైమ్ టు డై’ అనేది జేమ్స్ బాండ్ 25వ చిత్రం. ఈ సినిమాలో కూడా డేనియల్ క్రెగ్… జేమ్స్ బాండ్ గా కనిపించారు. తాజాగా జేమ్స్ బాండ్ 26వ సినిమా గురించిన ఓ వార్త హాలీవుడ్ లో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ 26వ జేమ్స్ బాండ్ సినిమాకు తొలుత డేనియల్ క్రెగ్ పేరు వినిపించినప్పటికీ… కానీ మరోసారి బాండ్ గా కనిపించేందుకు డేనియల్ ఆసక్తికరంగా లేరట. దీనితో కొత్త జేమ్స్ బాండ్ ఎవరు అనే దానిపై ఇప్పుడు హాలీవుడ్ లో ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది.
Aaron Taylor Johnson Movie Updates
అయితే కొత్త జేమ్స్ బాండ్ గా ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్ సినిమాలు ‘కిక్కాస్’, ‘చాట్ రూమ్’, ‘గాడ్జిల్లా’, ‘అవెంజర్స్’ వంటి సినిమాలతో మెప్పించారు ఆరోన్ టేలర్(Aaron Taylor Johnson)… జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కు పెర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ హాలీవుడ్ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం, వయసు రీత్యా కూడా జేమ్స్ బాండ్ గా ఆరోన్ కు ప్లస్ అంటున్నారు. అలాగే ‘జేమ్స్‌బాండ్ 26’వ చిత్రానికి ఓపెన్ హైమర్ సినిమాతో ఏడు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త జేమ్స్ బాండ్ ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read : Ram Charan: గ్రాండ్ గా ‘RC16’ పూజా కార్యక్రమం ! హాజరైన సినీ ప్రముఖులు !