Maharaj : బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్(Amir Khan) తనయుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా మహారాజ్. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చాలా సమస్యలను ఎదుర్కొంది. సినిమాను విడుదల చేయకూడదంటూ పలువురు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. కోర్టు కూడా సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో జునైద్ సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం మహారాజ్ సినిమాను విడుదల చేయాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. నిషేధం ఎత్తివేయబడిన వెంటనే, మేకర్స్ ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ OTTలో విడుదల చేశారు. మహారాజ్‌ను బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. జునైద్ ఖాన్‌కి ఇది మొదటి సినిమా. పాటల్ లోక్ ఫేమ్ జైదీప్ అహ్లావత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. మహరాజ్ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఉన్నాయని కొందరు పేర్కొన్నారు.
Maharaj OTT Updates
సౌరభ్ షా రచించిన మహారాజ్ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. పుస్తకం 2013 నుండి అమ్మకానికి ఉంది. పుస్తకం గురించి ఎటువంటి వివాదం లేదు. శాంతిభద్రతలకు విఘాతం కలగదు. దీని తర్వాత మహారాజ్ చిత్రానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని నిర్మాత తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న కోర్టు.. ఈ మేరకు సినిమా విడుదలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతలో మహారాజ్ సినిమా చూడమని నిర్మాత జడ్జిని అడిగాడు. ఈ పిటిషన్‌కు న్యాయమూర్తి అంగీకరించారు. సినిమా చూసిన తర్వాత హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇందులో ఏమీ లేదని అన్నారు. కోర్టు తీర్పును అనుసరించి నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అయితే, OTTలో ఈ చిత్రంపై మిశ్రమ సమీక్షలు ఉన్నాయి. మహారాజ్ చిత్రం హిందీలోనే కాకుండా తెలుగు మరియు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.
Also Read : Salman Khan : సల్మాన్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో మూవీ ఉందా..?