Aamir Khan: ప్రముఖ రచయిత చేతన్ భగత్ రచించిన ఫైవ్ పాయింట్స్ ఫర్ సమ్ వన్ నవల ఆధారంగా నిర్మించిన సినిమా 3 ఇడియట్స్. అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటి మోనా సింగ్… తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ను చెంప దొబ్బ కొట్టడమేనట.
3 ఇడియట్స్ సినిమాలో నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో ఓ కీలక సన్నివేశం ఉంటుంది. సినిమాలో సన్నివేశం ప్రకారం పురిటి నొప్పులతో బాధపడుతున్న మోనా సింగ్ కు… తన గర్ల్ ఫ్రెండ్ కరీనా కపూర్ వీడియో కాల్ లో ఇచ్చే సూచనల ప్రకారం హీరో అమీర్ ఖాన్(Aamir Khan) ప్రసవం చేయిస్తాడు. ఈ ప్రసవం సీన్ బాగా పండటంతో సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీనితో ఈ ప్రసవం సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు… జరిగిన ఫన్నీ థింగ్స్ గురించి నటి మోనా సింగ్ ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
Aamir Khan – ప్రసవం సమయంలో అమీర్ ను చెంప దెబ్బ కొట్టిన మోనా
ఈ సీన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అందులో పాల్గొన్న వారంతా… తమ భార్యల ప్రసవం సమయంలో వారి వారి అనుభవాలను పంచుకున్నారు. దీనిలో భాగంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ భార్య తనను తన్నిందని చెప్పారు. ఆర్ మాధవన్ అయితే తన భార్య కొరికిందని చెప్పారు. దీనితో నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగేసరికి… అమీర్ ఖాన్ చెంపమీద కొట్టమని చెప్పారు. అంతేకాదు గట్టిగా కొట్టమని అమీర్ ఖాన్(Aamir Khan) ఆదేశించారని… దీనితో తన బలాన్నంతా కూడగట్టుకుని అమీర్ ఖాన్ ను చెంప దెబ్బ కొట్టానని అన్నారు. అయితే ఆ చెంప దెబ్బకు అమీర్ ఖాన్ సెక్యూరిటీ సిబ్బంది తన వైపు ఆగ్రహంగా చూసినప్పటికీ…. అమీర్ మాత్రం పాత్రలో లీనమైపోయారని మోనా సింగ్ అన్నారు. దీనితో అమీర్ ను చెంప దెబ్బ కొట్టిన బాలీవుడ్ నటి అంటూ ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఈ సందర్భంగా ఆమె అమీర్ తో పాటు చిత్ర యూనిట్ గురించి చాలా ఆశక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో సీనియర్ హీరోలు నటించినప్పటికీ… ప్రతీ సీన్ కూడా సహజంగా రావాలనే ఉద్దేశ్యంతో చాలా సార్లు రిహార్సల్ల్ చేసేవారన్నారు. అమీర్ ఖాన్(Aamir Khan) అయితే అస్సలు స్టార్ గా ఎప్పుడూ ఈ సెట్ లో బిహేవ్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు మూడు జాతీయ, ఎన్నో ఇతర అవార్డులు గెలుచుకుంది.
Also Read : Animal: కొనసాగుతున్న ‘యానిమల్’ కలెక్షన్స్ హంట్