Aamir Khan: షూటింగ్ పూర్తి చేసుకున్న అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్‌’ !

షూటింగ్ పూర్తి చేసుకున్న అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్‌’ !

Aamir Khan: బుద్ధిమాంద్యం పిల్లల్లోని అసాధారణ ప్రతిభను వెలికితీయాలనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘తారే జమీన్‌ పర్‌’. ఆమిర్‌ఖాన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనితో ‘తారే జమీన్‌ పర్‌’ కు సీక్వెల్ గా ‘సితారే జమీన్‌ పర్‌’ను ఆర్‌ఎస్‌ ప్రసన్న తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమిర్‌ ఖాన్‌ సరసన జెనీలియా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లు తెలిపింది చిత్రబృందం.

Aamir Khan…

‘‘విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేశాం. ఇంతకుముందు చిత్రం ప్రేక్షకుల హృదయాలను బరువెక్కిస్తే… ఈ సీక్వెల్‌ అందరినీ నవ్విస్తుందని” చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. దర్శీల్‌ సఫారీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ ప్రాజెక్టును ఆమిర్‌ఖాన్‌ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : NTR Film Awards: ఈ నెల 29న ఎన్టీఆర్‌ పిల్మ్ అవార్డ్స్ ప్రదానం !

Aamir KhanSitaare Zameen ParTaare Zameen Par
Comments (0)
Add Comment