Hero Aamir Khan : ల‌గాన్ ఫెయిల్ అవుతుంద‌నుకున్నా

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కామెంట్స్

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను న‌టించిన ల‌గాన్ మూవీ గురించి స్పందించారు. చిట్ చాట్ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ల‌గాన్ ను ఆద‌రించార‌ని గుర్తు చేసుకున్నారు. షూటింగ్ మొద‌లు పెట్టిన‌ప్పుడు తాను సినిమా ఫెయిల్ అవుతుంద‌ని అనుకున్నాన‌ని అన్నారు. కానీ ఊహించ‌ని రీతిలో బిగ్ స‌క్సెస్ చేశార‌ని ఇప్ప‌టికీ ఆ సినిమాకు సంబంధించిన క‌లెక్ష‌న్ల‌ను ఏ సినిమా బీట్ చేయ‌క పోవ‌డం త‌న‌ను మ‌రింత సంతోషానికి లోన‌య్యేలా చేసింద‌న్నాడు.

Aamir Khan Comments

లగాన్ అనేది సినిమా కాద‌ని అది భార‌తీయ జీవితంలో ఉన్న మ‌ధుర‌మైన జ్ఞాప‌క‌మ‌ని పేర్కొన్నారు . త‌న సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాన‌ని, కానీ మ‌రిచి పోలేనిది ఏమైనా ఉందంటే అది ల‌గాన్ అన్నాడు అమీర్ ఖాన్(Aamir Khan). ఒక్కో న‌టుడికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంద‌న్నారు. తాను క‌థ‌ల‌పై ముందు ఫోక‌స్ పెడ‌తాన‌ని చెప్పాడు. లేక పోతే ప‌ట్టించుకోన‌ని అన్నాడు. ఆరు ప‌దుల వ‌య‌సు వ‌స్తున్న‌ప్ప‌టికీ త‌న మ‌న‌సు మాత్రం ఇంకా 18 ఏళ్ల ద‌గ్గ‌రే ఆగి పోయింద‌న్నారు. ఇన్నేళ్ల కాలంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కొన్నాన‌ని చెప్పాడు.

ల‌గాన్ షూటింగ్ అప్పుడు త‌న‌ను ఎంతగానో భ‌య పెట్టార‌ని, క్రికెట్ గురించిన ఏ సినిమా బాగా ఆడ‌లేదంటూ ఎద్దేవా చేశార‌ని పేర్కొన్నాడు. ఆ టైమ్ లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఇచ్చిన వాయిస్ ఓవ‌ర్ అయితే ఇక ఆ సినిమా ఖేల్ ఖ‌తం అంటూ ఎద్దేవా చేశార‌ని కానీ సీన్ మారింద‌న్నాడు. బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్స్ చేసిన మూవీగా ల‌గాన్ ఇప్ప‌టికీ నెంబర్ వ‌న్ గా నిలిచింద‌న్నాడు.

Also Read : Champions Trophy 2025 Final :విశ్వ విజేత టీమిండియా

Aamir KhanCinemaCommentsViral
Comments (0)
Add Comment