Aamir Khan: రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా – ఆమిర్ ఖాన్‌

రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా - ఆమిర్ ఖాన్‌
Aamir Khan: రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా – ఆమిర్ ఖాన్‌

Aamir Khan: ‘నేను ఏ అవార్డు వేడుకలకు, టీవీ షోలకు రాను. కానీ కపిల్‌ శర్మ కార్యక్రమానికి రావడానికి ప్రత్యేక కారణముంది. గత రెండేళ్లుగా నేను చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా. మానసికంగా చాలా వీక్‌గా ఉన్నా. ఎంత బాధలో ఉన్నా సరే ఈ కార్యక్రమం చూస్తే నవ్వొస్తుంది. అందుకే దీనికి రావాలని నిర్ణయించుకున్నా’ అని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అన్నారు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే కామెడీ షో ‘కపిల్‌ శర్మ షో’కు ఆమిర్‌ మొదటిసారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌ కు సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు. 2014లో రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘పీకే’ లోని ఓ సన్నివేశంలో నగ్నంగా నటించినట్లు ఆమిర్‌ ఖాన్‌ తాజాగా వెల్లడించారు.

Aamir Khan Issues

‘పీకే’ లోని ఆ సన్నివేశం షూటింగ్ గురించి హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) వివరిస్తూ… ‘‘పీకే’లో నేను రేడియో పట్టుకుని నగ్నంగా పరిగెత్తే సన్నివేశం ఉంటుంది. దాన్ని షూటింగ్‌ మొదలుపెట్టగానే దర్శకుడు అందరి ఫోన్‌ లు తీసేసుకున్నారు. నాకు చిన్న ప్రత్యేకంగా తయారు చేసిన షార్ట్‌లు ఇచ్చారు. పొత్తికడుపులో దెబ్బతగలకుండా క్రికెట్‌ లో వాడే గార్డ్స్‌లాగా ఉంటాయి. వాటితో కేవలం ముందువైపు మాత్రమే కప్పుకోవడానికి వీలవుతుంది. అది వేసుకుని, రేడియో పట్టుకుని పరిగెత్తడం మొదలు పెట్టాను. టేపుతో అంటించడం వల్ల పరిగెత్తేటప్పుడు ఆ షార్ట్‌ ఊడిపోయి చాలా ఇబ్బందిగా అనిపించింది.

రెండు మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత దాన్ని తీసేస్తానని హిరాణీకి చెప్పా. అందరినీ కెమెరా నుంచి దూరంగా వెళ్లమని చెప్పి నగ్నంగా పరిగెత్తాను. అది చిత్రీకరించేటప్పుడు ముందు కాస్త కంగారుపడ్డాను. సన్నివేశం బాగా రావడం కోసం ఏమైనా చేయాలనుకునే స్వభావం నాది. అందుకే చేశాను. అప్పుడేం అనిపించలేదు కానీ, సినిమాలో ఆ సీన్‌ చూసిన తర్వాత షాకయ్యాను. నేనేనా ఇలా చేసిందనిపించింది’ అని ఆమిర్‌ అన్నారు. రూ. 85 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఏకంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది.

Also Read : Puri Jagannadh: ప్రేమలో విఫలమైతే మద్యానికి బానిస కావొద్దు – పూరి జగన్నాథ్‌

Aamir KhanKapil Sharma ShowPK
Comments (0)
Add Comment