Aamir Khan : తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ అగ్రహీరో ఆసక్తికర వ్యాఖ్యలు

అందుకే దీనిని సరైన పద్థతిలో సక్రమంగా తెరకెక్కించాలనుకుంటున్నా....

Aamir Khan : తన మాజీ భార్య కిరణ్‌ రావుతో కలిసి నిర్మించిన ‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఉంది. ఈ మేరకు ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గురించి బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) చెప్పుకొచ్చారు. ‘మహాభారతం’ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని అన్నారు. ‘‘ఎన్నో ఏళ్లగా కలగా పెట్టుకున్న ప్రాజెక్ట్‌ ఇది. దీని విషయంలో బాధ్యతతోపాటు భయం కూడా ఉంది. ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నా. భారతీయుడిగా ఈ కథ మన రక్తంలో ఉంది. కాబట్టి, ఇది నాపై ఎంతో బాధ్యత పెంచింది.

అందుకే దీనిని సరైన పద్థతిలో సక్రమంగా తెరకెక్కించాలనుకుంటున్నా.. ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఇది జరుగుతుందో? లేదో? తెలియదు. కానీ నేను మాత్రం దీని కోసం వర్క్‌ చేయాలనుకుంటున్నా. అంతే కాదు మంచి కంటెంట్‌తో మరెన్నో చిత్రాలు తీయాలనుకుంటున్నా. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించాలి. గొప్ప కథలను ప్రేక్షకులకు అందించాలనేది నా ఆలోచన. నిర్మాతగా మారినప్పటికీ నటుడిగానూ సినిమాల్లో యాక్ట్‌ చేస్తా. ప్రస్తుతం రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నా. రానున్న రోజుల్లో సంవత్సరానికి ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నా’’ అని తెలిపారు.

Aamir Khan Comments

2022లోవిడుదలైన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తర్వాత ఆమిర్‌ ఖాన్‌.. హీరోగా మరో సినిమా చేయలేదు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘లాపతా లేడీస్‌’. కిరణ్‌ రావు దీనికి దర్శకత్వం వహించారు. 2025 ఆస్కార్‌ పోటీలకు ఈ చిత్రం మన దేశం తరఫు నుంచి అధికారికంగా ఎంపికైౖన విషయం తెలిసిందే.

Also Read : Chiranjeevi 159 : దర్శకుడు అనిల్ రావిపూడి తో సినిమాకు సిద్ధమవుతున్న మెగాస్టార్

Aamir KhanMoviesUpdatesViral
Comments (0)
Add Comment