Hero Aamir Khan :60 ఏళ్లు పూర్తి చేసుకున్న అమీర్ ఖాన్

చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరుదైన న‌టుడు

Aamir Khan : అమీర్ ఖాన్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. మార్చి 14తో త‌ను 60 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. విభిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ గా త‌న‌ను తాను మ‌ల్చుకున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ బాలీవుడ్ లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్నాడు. త‌న సినీ కెరీర్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు ఉన్నాయి. అంత‌కు మించిన సామాజిక సందేశాత్మ‌క మూవీస్ కూడా లేక పోలేదు. అమీర్ ఖాన్(Aamir Khan) కు ప్ర‌పంచ వ్యాప్తంగా లెక్క‌కు మించిన అభిమానులు ఉన్నారు.

Aamir Khan Birthday

స‌ల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కంటే భిన్నమైన పాత్ర‌లు పోషించాడు అమీర్ ఖాన్(Aamir Khan). గౌరీ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో ఈ ఇద్ద‌రూ త‌మ సుదీర్ఘ వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికారు. దీనికి కార‌ణాలు ఏమిట‌నేది ఇద్ద‌రూ చెప్ప‌లేదు. త‌న‌కు ఓ కూతురు కూడా ఉంది. ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే అర్థవంతమైన సినిమాలు చేయడంలో అమీర్ ఖాన్ ప్రసిద్ధి చెందాడు. మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌తో, అమీర్ ఖాన్ భారతీయ సినిమాను పునర్నిర్వచించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాడు.

తండ్రి తాహిర్ హుస్సేన్ చిత్ర నిర్మాత‌, మామ నాసిర్ హుస్సేన్ ద‌ర్శ‌కుడు. త‌న మామ 1973లో తీసిన యాదోన్ కీ బారాత్ లో బాల న‌టుడిగా సినీ జీవితాన్ని స్టార్ట్ చేశాడు. 1988లో ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్ త‌న అస‌లైన జీవితం ప్రారంభ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 1990లో టాప్ హీరోగా కొన‌సాగాడు. రాజా హిందూస్తానీ, దిల్, స‌ర్ఫ‌రోష్ బాక్సాఫీస్ చిత్రాల‌లో న‌టించాడు. అందాజ్ అప్నా అప్నా , దిల్ చాహ్తా హై వంటి కామెడీ సినిమాల‌లో కూడా మెప్పించాడు.

2001లో విడుద‌లైన లగాన్ భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆస్కార్ రేసులో నిలిచింది. అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా ఇప్ప‌టికీ ఉంది. రంగ్ దే బ‌సంతి సూప‌ర్ హిట్ అయ్యింది. తారే జ‌మీన్ ప‌ర్ ఆలోచింప చేసేలా చేశాడు. సామాజిక సందేశంగా తీసిన ఇడియ‌ట్స్ సెన్సేష‌న్ గా నిలిచింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన దంగ‌ల్ ఇప్ప‌టి దాకా ఉన్న రికార్డుల‌ను తిర‌గ రాసింది.

Also Read : Hero Nagarjuna-Puri Jagannath :మ‌న్మ‌థుడితో పూరీ జ‌గ‌న్నాథ్ మూవీ..?

Aamir KhanBirthdayUpdatesViral
Comments (0)
Add Comment