ఆమిర్ ఖాన్ ఇంట మెదలైన పెళ్ళి సందడి
Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంట పెళ్ళి వేడుకలు ప్రారంభమయ్యాయి. తన కుమార్తె ఐరాఖాన్, నుపుర్ ల వివాహం నిశ్ఛయం కావడంతో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. దీనితో భాగంగా మంగళవారం తన ఇంట్లో కెల్వన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కెల్వన్ కార్యక్రమంకు సంబందించిన ఫోటోలను ఐరా తాజాగా తన ఇన్ స్టా లో సఏర్ చేసారు. కాబోయే వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు కెల్వన్ తో ప్రారంభమవుతాయి. వధూవరుల ఇరు కుటుంబ సభ్యులు విందు భోజనాలు ఏర్పాటు చేసి, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.
Aamir Khan – ఆమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తా ల గారాల పట్టి ఐరా ఖాన్
ఆమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తా ల గారాల పట్టి ఐరా ఖాన్. గత కొన్నేళ్ల నుంచి ఆమిర్ ఖాన్‌కు(Aamir Khan) వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న నుపుర్ శిఖర్ తో ఐరా ప్రేమలో పడింది. ఐరా సైతం నుపుర్ వద్ద ఫిట్ నెస్ పాఠాలు నేర్చుకుంది. ఈ క్రమంలో వీరిద్ధరి మధ్య ఏర్పడిన ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుండి ఆమోదం లభించడంతో జనవరి 3, 2024న వివాహం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. అంతేకాదు ఈ గత ఏడాది నవంబర్ 18న నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది.
నుపుర్ మహారాష్ట్ర అబ్బాయి కావడంతో వారి సంప్రదాయం ప్రకారం కెల్వన్ కార్యక్రమం నిర్వహించి పెళ్లి పనులు ప్రారంభిస్తారు. దీనితో భాగంగా మంగళవారం కెల్వన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇది ఇలా ఉండగా నుపుర్ తనని ఎంతగానో అర్థం చేసుకున్నాడని.. తాను డిప్రెషన్‌తో పోరాడుతున్న సమయంలో అతను అండగా నిలిచాడని ఐరా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘‘వాళ్ల మనసులు దగ్గరయ్యాయి. వాళ్ల పెళ్లి నాడు నేనెంతో భావోద్వేగానికి గురవుతా’’ అని ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు.
Also Read : Sharwanand: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో