రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ తేజ్
Aadi Keshava : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఆదికేశవ(Aadi Keshava) సినిమా ఎట్టకేలకు ఈ నెల 24న విడుదల చేయనున్నారు. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణాదాస్, రాధిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 10న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల నవంబర్ 24కు వాయిదా పడింది. దీనితో సినిమా ప్రమోషన్ లో చిత్ర యూనిట్ స్పీడు పెంచింది. ఈ సందర్భంగా ‘ఆదికేశవ’ గ్లింప్స్ విడుదలైన సమయంలో నెట్టింట జరిగిన చర్చపై దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి స్పందించారు.
Aadi Keshava- ‘ఆదికేశవ’ గ్లింప్స్ పై దర్శకుడు శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
‘ఆదికేశవ’ గ్లింప్స్ విడుదలైన సమయంలో నెట్టింట జరిగిన చర్చపై స్పందించిన దర్శకుడు శ్రీకాంత్… ‘‘వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆలయాన్ని సంరక్షించే హీరో స్టోరీ కాదు. ఈ సినిమా కథలో అంతర్లీనంగా శివుడి గురించి ప్రస్తావించాలనుకున్నాన్నంతే. ఇందులో టెంపుల్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ టెంపుల్ దృశ్యాలతో కూడిన గ్లింప్స్‌తో ప్రచారం మొదలు పెడితే బాగుంటుందని భావించి విడుదల చేశాం. అయితే, దాన్ని చూసి కొందరు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంతో పోల్చినప్పుడు కాస్త భయపడ్డాం. ఈ సినిమాని వేరే కోణంలో చూస్తున్నారనిపించింది. కాని ఈ సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్‌తో సమాధానం ఇవ్వబోతున్నాం’’ అని ఆయన తెలిపారు.
‘స్వామి రారా’, ‘కేశవ’ తదితర సినిమాల దర్శకుడు సుధీర్ వర్మ వద్ద సహాయకుడిగా పనిచేసిన శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ముందుగా మంచు మనోజ్ హీరోగా ‘అహం బ్రహ్మస్మి’ సినిమాని ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్టు కాస్తా ఆలస్యం అయింది. దీనితో ఈలోగా ‘ఆదికేశవ’ను తెరకెక్కించారు. అయితే ‘అహం బ్రహ్మస్మి’ కూడా తప్పక తెరకెక్కిస్తానని దర్శకుడు శ్రీకాంత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Also Read : Rajanikanth-Amitab: ప్రపంచ్ కప్ ఫైనల్ పై బిగ్ బి, సూపర్ స్టార్ ఆశక్తికర వ్యాఖ్యలు