Aadhi Pinisetty: ఆది పినిశెట్టి ‘శబ్దం’ టీజర్‌ విడుదల !

ఆది పినిశెట్టి 'శబ్దం' టీజర్‌ విడుదల !

Aadhi Pinisetty: హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘శబ్దం’. వీరిద్దరి కాంబినేషన్‌ లో గతంలో వచ్చిన ‘వైశాలి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీనితో చాలా ఏళ్ల తరువాత ఆది పినిశెట్టి… అరివళగన్‌ డైరెక్షన్‌లో ‘శబ్దం’ సినిమాలో నటించాడు. ఆది పినిశెట్టితో(Aadhi Pinisetty) పాటు ఈ చిత్రంలో లక్ష్మీ మేనన్‌, సిమ్రాన్‌, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7జి శివ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నుంచి చాలా క్రేజీగా ఉన్న ఈ ట్రైలర్‌ ను తాజాగా విక్టరీ వెంకటేష్‌ విడుదల చేశారు.

Aadhi Pinisetty Movie Updates

ఇక టీజర్ విషయానికి వస్తే… ఈ సినిమా ఆత్మల వల్ల జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని టీజర్‌ తో దర్శకుడు హింట్‌ ఇచ్చాడు. ఆత్మల గురించి పరిశోధించే పాత్రలో ఆది కనిపించాడు. సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమా రూపొందుతోంది. హాంటెడ్ హౌస్‌లో అతీంద్రియ సంఘటనలు చుట్టూ టీజర్‌ నడిచింది.
ముఖ్యంగా టీజర్‌లో థమన్‌ అందించిన ప్రత్యేకమైన సౌండ్‌ ఎఫెక్ట్స్‌ అదిరిపోయాయాని చెప్పవచ్చు. ఇందులోని బీజీఎమ్‌ చాలా కొత్తగా థమన్‌ అందించాడు. ముంబై, మున్నార్‌, చెన్నై తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ కోసం రూ.2 కోట్ల బడ్జెట్‌తో 120ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించామని గతంలో చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పుడు అది టీజర్‌లో ప్రధాన హైలెట్‌ గా నిలిచింది. టీజర్‌లో కెమెరామెన్‌ అరుణ్‌ బత్మనాభన్‌ ప్రతిభ మెరుగ్గానే ఉంది. ఈ సమ్మర్‌ లోనే శబ్దం విడుదల కానుంది.

Also Read : Sakshi Vaidya: మలయాళ సీమలోకి అఖిల్ బ్యూటీ !

 

Aadhi PinisettySabdham
Comments (0)
Add Comment