Sekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట ఘోర విషాదం

శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతితో ఆయన ఇంట విషాదం నెలకొంది...

Sekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతి చెందారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. శేఖర్ మాస్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ మూవ్స్ కు మంచి క్రేజ్ ఉంది. చాలా హుక్ స్టెప్స్ పాపులర్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు కూడా హాజరవుతున్నారు. అలాగే డాన్స్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

Sekhar Master..

శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతితో ఆయన ఇంట విషాదం నెలకొంది. శేఖర్‌ మాస్టర్‌(Sekhar Master) తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. సుధా నిన్ను మిస్‌ అవుతున్నాం.. నేను ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా.. నువ్వే గుర్తుస్తోన్నావు. నువ్వు ఇక లేవు.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు మాత్రం ఎక్కడో ఓ చోట ఆనందంగా ఉంటావని అనుకుంటున్నా.. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు. మిస్‌ యూ రా తమ్ముడు.. అంటూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అందరిని కలిచి వేస్తోంది. శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శేఖర్ మాస్టర్ కు దైర్యం చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతికి గల కారణం ఏంటనేది తెలియలేదు.

Also Read : Hero NTR : మరో యంగ్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్

BreakingShekar MasterUpdatesViral
Comments (0)
Add Comment