Devara Audio Rights : దేవర ఆడియో హక్కులను సొంతం చేసుకున్న బడా సంస్థ

భారీ ధరకు సొంతం చేసుకున్న టీ-సిరీస్

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గ్లిమ్ప్స్ ను సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నారు.

Devara Audio Rights Business Viral

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. బాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి టి-సిరీస్ కంపెనీ దేవర(Devara) ఆడియో హక్కులను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇది ఎంత ధరకు అమ్ముడైందో తెలియలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. హీరో ఎన్టీఆర్ కి ఆర్‌ఆర్‌ఆర్ తరవాత చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్వహణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Also Read : Tandel Movie : వైరల్ అవుతున్న నాగచైతన్య ‘తండేల్’ టీజర్

BreakingDevaraMovieTrendingUpdates
Comments (0)
Add Comment