8 Vasanthalu : ప్రతి కథ ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాల్సిందే. కొన్ని కథలు మన మధ్యనే ఉన్నట్టు అనిపిస్తాయి. ఇంకొన్ని గుండెల్ని హత్తుకుంటాయి. ఒక్కో దర్శకుడిది ఒక్కో టేస్ట్. మనసుల్ని , భావోద్వేగాలను ఒడిసి పట్టుకునే నైపుణ్యం కొందరికే ఉంటుంది. కొత్త తరం దర్శకులు తమ ప్రతిభా నైపుణ్యాలను తెర మీద ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో పలు షార్ట్ ఫిలిమ్స్ (లఘు చిత్రాలు) తో పాపులర్ అయిన ఫణీంద్ర నర్సెట్టి.
8 Vasanthalu Movie Updates
తను తీసిన వాటిలో ఎక్కువగా హత్తుకునేలా చేసింది మాత్రం మధురం. ఇది చాలా మందిని చూసేలా చేసింది. మాటలు, తీసే విధానం ఎక్కువగా ఆకట్టుకుంది. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ సినిమా తీయడంలో నిమగ్నమయ్యాడు. ఇందుకు సంబంధించి తను తీసిన 8 వసంతాలు చిత్రానికి సంబంధించిన టీజర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు.
హీరో , హీరోయిన్ల మధ్య నడిచే సంభాషణలు మరింత సినిమాపై హైప్ పెంచేలా చేశాయి. బాధ గురించి హీరో చెప్పిన తీరు మరింత మెలిపెట్టేలా ఉంది. చిత్రీకరణ, సన్నివేశాలు, మాటలు ఈ మూవీకి అదనపు బలాన్ని చేకూర్చేలా చేశాయని చెప్పడంలో సందేహం లేదు.
వినసొంపైన సంగీతం, ఆహ్లాదానికి గురి చేసే దృశ్యాలు, గుండెల్ని మీటే మాటలు మనల్ని వెంటాడటం ఖాయం.
Also Read : Samantha Shocking : ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం