70th National Awards : నేడు నేషనల్ అవార్డులు అందుకోబోయేది వీరే

ఢిల్లీలోని విజన్ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది...

70th National Awards : 70వ జాతీయ అవార్డు వేడుక నేడు (అక్టోబర్ 8) జరగనుంది. భారతీయ సినిమాకు ఇది ప్రత్యేకమైన రోజు. అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన కళాకారులు ఇందులో పాల్గొంటారు. దాదా సాహెబ్ ఫాల్కే, రాష్ట్ర అవార్డులను నేడు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది. మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అందించనున్నారు. 70వ జాతీయ అవార్డు(National Film Awards)ను ఆగస్టు 16న ప్రకటించారు. నేడు (అక్టోబర్ 8) ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఢిల్లీలోని విజన్ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అవార్డు విజేతలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ అవార్డు కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోబోతున్నాడు. అయితే అతనిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా అతనిపై కేసు నమోదైంది. అతడిని కూడా అరెస్టు చేశారు. ఈ కారణంగా జానీ మాస్టర్‌కు ఇవ్వాల్సిన జాతీయ అవార్డును ప్రభుత్వం రద్దు చేసింది.

70th National Awards – 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకోనున్న సినిమాలు ఇవే..

ఉత్తమ తెలుగు చిత్రం : కార్తికేయ-2 – ఉత్తమ కన్నడ చిత్రం : కేజీఎఫ్‌-2 – ఉత్తమ తమిళ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1 – ఉత్తమ మ్యూజికల్‌ డైరెక్టర్‌ రహమాన్‌ (పొన్నియన్‌ సెల్వన్‌-1) — ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ – పొన్నియన్‌ సెల్వన్‌ — బెస్ట్‌ సినిమాటోగ్రఫీ- పొన్నియన్‌ సెల్వన్‌ — ఉత్తమ సహాయనటి నీనా గుప్తా — ఉత్తమ సహాయనటుడు పవన్‌ రాజ్‌ మల్హోత్రా — ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్-దీపక్‌ దువా (హిందీ) — బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్.. కుచ్ ఎక్స్ ప్రెస్.. గుజరాతీ, నిక్కిజోషి. — బెస్ట్ మ్యూజిక్.. బ్రహ్మస్త్ర.. శివ (హిందీ) ప్రీతమ్ — ఉత్తమ సంగీతం నేపథ్యం.. పొన్నియన్ సెల్వన్ 1.. తమిళ్.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. — బెస్ట్ రైటర్.. గుల్ మోహర్ : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల — బెస్ట్ యాక్షన్ డైరెక్షన్.. అన్బరివు.. కేజీఎఫ్ 2 — బెస్ట్ కొరియోగ్రఫీ.. సతీశష్ కృష్ణన్ తిరుచిత్రాంబళం తమిళ్.. — బెస్ట్ లిరిక్స్.. ఫౌజా..(హరియాన్వీ), రచయిత.. నౌషద్ సదర్ ఖాన్. — బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్).. ఆట్టం.. ఆనంద్ ఏకార్షి.

Also Read : Emraan Hashmi : షూటింగ్ లో గాయపడ్డ ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్

National Film AwardsTrendingUpdatesViral
Comments (0)
Add Comment