68th Filmfare Awards: 68వ ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన RRR, సీతారామం, విరాట ప‌ర్వం !

68వ ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన RRR, సీతారామం, విరాట ప‌ర్వం !

68th Filmfare Awards: 2023 సంవ‌త్స‌రానికి గాను సౌత్ ఫిలింఫేర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. దక్షిణాది నాలుగు భాషల్లో గతేడాదితో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన సినిమాలను కూడా పరిగణలోనికి తీసుకుని ఈ 68వ ఫిలింఫేర్ అవార్డుల(68th Filmfare Awards)ను ఎంపిక చేసారు. వీటిలో RRR ఏడు అవార్డులు, సీతారామం ఐదు అవార్డులు, విరాట ప‌ర్వం రెండు అవార్డులతో త‌మ స‌త్తా చాటాయి. భీమ్లా నాయక్ ఒక అవార్డును దక్కించుకుంది. దాదాపు ఎక్కువ శాతం అవార్డుల‌ను RRR,సీతారామం, విరాట ప‌ర్వం చిత్రాలే ద‌క్కించుకున్నాయి.

68th Filmfare Awards – అవార్డులు సాధించిన సినిమాలు !

ఉత్త‌మ చిత్రం – RRR

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – రాజ‌మౌళి RRR

బెస్ట్ మ్యూజిక్ అల్బ‌మ్ – కీర‌వాణి (RRR)

బెస్ట్ యాక్ట‌ర్స్‌ – రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ (RRR )

బెస్ట్ ప్లేబాక్ సింగ‌ర్ (మేల్) – కాల భైర‌వ (RRR కొమ‌రం భీముడో)

స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌ – రానా (భీమ్లా నాయ‌క్)

బెస్ట్ యాక్ట‌ర్‌ లీడ్ – మృణాల్ ఠాకూర్ (సీతారామం)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్ (ఫిమేల్) – చిన్మ‌యి శ్రీపాద (సీతారామం)

ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం)

ఉత్త‌మ స‌హాయ న‌టి – నందితా దాస్ (విరాట ప‌ర్వం)

బెస్ట్ యాక్ట‌ర్ క్రిటిక్స్ – దుల్క‌ర్ స‌ల్మాన్ (సీతారామం)

బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ – సీతారామం

బెస్ట్ యాక్ట‌ర్ క్రిటిక్స్‌ విభాగం – సాయి ప‌ల్ల‌వి ( విరాట ప‌ర్వం)

బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ – సెంథిల్‌, ర‌వి వర్మ‌న్‌

బెస్ట్ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు పాట)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ – సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)

Also Read : Ram Charan : దేశంలోనే రెండవ కాస్ట్లీ కార్ తో వైరల్ అవుతున్న మెగా పవర్ స్టార్

68th Filmfare AwardsBhimla NayakRRRSeetharamamVirataparvam
Comments (0)
Add Comment